ప్రిన్స్‌ కమర్షియల్‌ హీరో‌..కానీ..- ఎన్టీఆర్

687
Jr NTR Speech @ Bharat Bahiranga Sabha...
- Advertisement -

భరత్‌ అనే నేను ‘భహిరంగ సభ’ ఇద్దరు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ తో దద్దరిల్లింది. ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకు సూపర్ స్టార్‌ మహేష్ బాబు, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఈ భహిరంగ సభకు జూనియర్‌ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్బంగా మాట్లాడిన ఎన్టీఆర్..’నందమూరి తారకరామారావు మనవడినైన నేను’ అంటూ తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా కాకుండా.. ఓ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు ఎన్టీఆర్‌. అంతేకాకుండా ఒక కమర్షియల్‌ స్టార్‌ అయ్యుండి మహేష్ బాబు చేసిన ఎక్పర్‌మెంట్స్ ఇప్పుడున్న హీరోల్లోఎవరూ చెయ్యలేదన్నారు. ఒక రకంగా ప్రిన్స్‌ మహేష్ ని తనతో పాటు ఇప్పుడున్న హీరోలు ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు.

‘భరత్‌ అనే నేను’ మహేష్‌ కెరీలోనే ఓ మైలు రాయిగా నిలబడాలని, రికార్డులు తిరగరాయాలని అన్నారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివ గురించి మాట్లాడిన ఎన్టీఆర్‌.. సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఇలాగే ఎప్పటికీ సమాజం పట్ల బాధ్యతను, ఇష్టాన్ని ఇలా సినిమాల ద్వారా తెలియజేయాలని కొరుకుంటున్నట్టు చెప్పారు యంగ్‌టైగర్.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఈనెల 20వ తేదీన రిలీజ్‌కి రెడీగా ఉంది.ఇక కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రిన్స్‌కి జోడీగా కియారా అద్వాని నటించగా, రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు.

- Advertisement -