సినీరంగానికి తీరని లోటు..

26
- Advertisement -

నటుడు చలపతిరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. వెండితెరపై చలపతిరావు తనదైన ముద్రవేశారని ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. వందలాది చిత్రాల్లో చలపతిరావు వైవిధ్యమైన పాత్రలు పోషించారని గుర్తుచేశారు. చలపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.. కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చలపతిరావుకు ఒక కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తన కెరీర్‌లో 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -