వావ్.. ఎన్టీఆర్ న్యూ లుక్‌ అదిరింది

29
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొత్త లుక్ ఫొటోను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలిమ్ హకీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.అలిమ్ హకీమ్ నిన్న మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ హెయిర్ కట్ కోసం భాగ్యనగరం వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో షూటింగ్ ఎప్పుడూ సరదాగా ఉంటుందని అలిమ్ హకీమ్ చెప్పుకొచ్చారు. ఇక అలిమ్ హకీమ్ పోస్ట్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్.. గడ్డం, కళ్ళజోడు, వావ్ అనిపించే హెయిర్ స్టైల్‌తో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు ఎన్టీఆర్.

దీంతో ఎన్టీఆర్ కి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే ఓ స్టార్ డైరెక్టర్ సినిమా కథ వినిపించగా ఎన్టీఆర్ దానిని నిరాకరించినట్టు సమాచారం. అలాగే మరో డైరెక్టర్ ఆదిత్యధర్ ‘అమర్ అశ్వథ్థామ’ చిత్రంలో హీరోగా నటించాలని ఎన్టీఆర్ ను సంప్రదించగా దేవర లో బిజీగా ఉండడంతో నో చెప్పారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అటు వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ పాత్ర హైలైట్ గా ఉంటుందట. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోతుంది అని, అందుకే ఎన్టీఆర్ తొందర పడటం వల్ల లేదని తెలుస్తోంది.

Also Read:పచ్చి అరటికాయ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

పైగా ఈ ‘వార్‌ 2’ సినిమా పై బాలీవుడ్‌ లో కూడా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఇందులో హృతిక్‌ రోషన్‌తో ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్నాడు. ఈ కాంబో సెట్‌ అవ్వగానే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభ‌మ‌వ‌నుంది. 2025 జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం తారక్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Also Read:చైనాను దాటం..సమస్యలు అధిగమిస్తామా?

- Advertisement -