యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి మరో బాబుకి జన్మనిచ్చింది. దింతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోకి మరో వ్యక్తి జాయిన్ అయాడు అన్నమాట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈవార్త ఎన్టీఆర్ అభిమానులకు సంతోషకరంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె బాబుకు జన్మనిచ్చింది . ఈసందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులకు ట్వీట్టర్ లో శుభవార్త తెలిపాడు. ‘కుటుంబం పెద్దదైంది .. మరోసారి బాబు’ అంటూ ట్వీట్ లో ఆయన పేర్కొన్నాడు.
The family grows bigger. It’s a BOY!
— Jr NTR (@tarak9999) June 14, 2018
ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలకు మొదటి సంతానం గా అభయ్ రామ్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ లైఫ్ లోకి మరో కుమారుడు రావడంతో చాలా ఆనందంగా ఉన్నాడు యంగ్ టైగర్. ఇక నందమూరి హరికృష్ణ ఫ్యామిలీలోని తన కుమారులు ముగ్గురికి మగ పిల్లలు పుట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ రామ్ కు ఇద్దరు కుమారులు, జానకీ రామ్ కు ఇద్దరు కుమారులు, అలాగే తాజాగా ఎన్టీఆర్ కు కూడా ఇద్దరు కుమారులు పుట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తోన్నాడు.