వారందరీ కంటే జూ.ఎన్టీఆరే బెటర్

42
- Advertisement -

ఆంధ్ర రాజకీయాల పరిస్థితి ప్రస్తుతం సినిమాటిక్ గా సాగుతున్నాయి. అందుకేమో.. ప్రస్తుతం సినిమా స్టార్స్ పేర్లు కూడా ఆంధ్ర రాజకీయ తెర పై బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం చంద్రబాబు జైలులో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తోంది. లోకేష్ సమర్ధత పై ఎవరికి ఎలాంటి నమ్మకాలు లేవు. సో.. మరి తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఏమిటి ?, నట సింహం బాలయ్య వల్ల ఉపయోగం లేదు అని ఆ పార్టీ వారే చెబుతున్నారు. అందుకే, మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర ప్రస్తుతానికి ప్రధాన పాత్రగా మారిపోయింది. కానీ, పవన్ కి – బాలయ్యకి పెద్ద తేడా లేదు అనేది వారి గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట. మరి ఇలాంటి ఉత్తిత్తి హీరోలూ.. అసామాన్యమైన ఆర్థిక – సామాజిక నేరస్థుడైన జగన్ మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోగలరు ?. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే.. వేల కోట్ల నుంచి లక్ష కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. ఇంకెంత సంపాధించి ఉంటాడు ?,

అలాంటి జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోగలరా వీరంతా ?, ఏం మాట్లాడుతున్నారో ?, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయి ఆవేశపడిపోయే ఈ ఎమోషనల్ హీరోలు జగన్ రెడ్డిని నివారించగలరా ?, ప్రత్యర్ధులను తినే రాబందు మాదిరిగా జగన్ వ్యవహార శైలి ఉంది. అలాంటి వ్యక్తి పై పవన్ – బాలయ్య మధ్యలో లోకేష్.. వీరితో ఎన్నికల సంద్రాన్ని దాటేది ఎలా చంద్రబాబు ?, జైలులో మగ్గిపోకుండా తెలివిగా బాబు ఆలోచిస్తే ఆయనకే మంచిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బెటరా..? జూనియర్ ఎన్టీఆర్ బెటరా… తేల్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చేసింది. పవన్ – బాలయ్య – లోకేష్.. ఈ ముగ్గురి కంటే.. ఆ మాటకొస్తే చంద్రబాబు – జగన్ కంటే కూడా.. టాలెంట్ పరంగా జూనియర్ ఎన్టీఆరే బెటర్.

సరైన వాచకంలో, ప్రజల్లో గుర్తింపు విషయంలో, ఫాలోయింగ్ లో, ఇక నాయకత్వం లక్షణాలలో, అన్నిటికి మించి లోతైన ఆలోచనలలో జూనియర్ ఎన్టీఆర్ కి చక్కని సమర్ధత ఉంది. ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ చేయడమే రాజకీయం అయిన ఈ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం అనుభవం లేకుండా అది చేయగలడా ?, టీడీపీకి ఉన్న ఆర్ధిక బలాన్ని కూడా జూనియర్ కి ఇస్తే కచ్చితంగా చేయగలడు. కానీ, బీజేపీ గ్రిప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి అయినా అన్ని బాధ్యతలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్దపడుతున్నాడు గానీ, జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి మాత్రం సిద్దపడడంలేదు. సిద్దపడకపోతే.. గెలవడం నిలవడం కష్టమే.

Also Read:ప్రతిరోజూ మెంతినీరు త్రాగితే ఎన్ని లాభాలో..!

- Advertisement -