బీ’జేపీ’ నడ్డాకు కరోనా పాజిటివ్..

154
jp nadda
- Advertisement -

దేశవ్యాప్తంగా ఎంతో మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటికీ పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అయితే తాను బాగానే ఉన్నానని, డాక్టర్ల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నానని నడ్డా వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసి వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -