ఖమ్మం ఐటీ హబ్‌ను సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి..

131
Minister Niranjan Reddy

ఖమ్మం పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చే లాంఛనంగా ప్రారంభించిన ఐటీ హబ్‌ను ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ సందర్శించారు. ఐటీ హబ్‌ను సందర్శించడానికి వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు పువ్వాడ అజయ్ కుమార్.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ హబ్‌ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. అన్ని జిల్లాలకు ఐటీ విస్తరణకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువలో ఉపాధి అవకాశాలు వచ్చాయని తెలిపారు.