అమెరికా రవాణాశాఖమంత్రిగా పీట్ బుట్టిగేగ్‌..

71
america

అమెరికా ర‌వాణాశాఖ మంత్రి పీట్ బుట్టిగేగ్‌ నియమితులయ్యారు. ఎల్‌జీబీటీక్యూ వ‌ర్గానికి చెందిన స్వ‌లింగ సంప‌ర్కుడికి బైడెన్ తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ప్రజలకు పరిచయం చేశారు. అమెరికా క్యాబినెట్ చ‌రిత్ర‌లోనే గే వ్య‌క్తి మంత్రి కావ‌డం కూడా ఇదే తొలిసారి.

బైడెన్ క్యాబినెట్‌లో పీట్ బుట్టిగేగ్ తొమ్మిదో వ్య‌క్తి కాగా, ఆయ‌న గే కావ‌డం విశేషం. ఇండియానా రాష్ట్రంలోని సౌత్ బెండ్‌కు మేయ‌ర్‌గా చేశారాయ‌న‌. వాస్త‌వానికి అధ్య‌క్ష రేసులో పోటీ ప‌డ్డ పీట్‌.. ఆ త‌ర్వాత బైడెన్‌కు మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు.

అమెరికా ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిందని, ఇది సూపర్ పవర్ ప్రజాస్వామ్యం అని పేర్కొంది.