పార్లమెంట్ సమావేశాల రద్దుపై శివసేన విమర్శలు…

51
shivsena

పార్లమెంట్ సమావేశాల రద్దుపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది.ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన శివసేన…ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన, దేశ ఆర్థిక పరిస్థితి, చైనాతో సరిహద్దు వివాదం వంటి తదితర అంశాలపై చర్చను తప్పించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడింది.

కరోనా మహమ్మారి ఎన్నికలనే ఆపలేదని, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశం.. కానీ పార్లమెంట్‌ నాలుగు రోజుల శీతాకాల సమావేశాలను అనుమతించం అనడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడింది.