అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్…

259
biden
- Advertisement -

సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది. హోరా హోరిగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. 538 ఎలక్టోరల్ ఓట్లకు గానూ బైడెన్‌కు 290 ఓట్లు రాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. చివరి వరకు నువ్వా నేనా అంటూ సాగిన పోరులో బైడెన్ విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళా కమలా హ్యారిస్ ఎంపికయ్యారు.

వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్‌, హ్యారిస్‌ ప్రమాణం చేయనున్నారు.ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్‌…. డెలావర్‌కు సుదీర్ఘకాలంగా సెనేటర్‌గా విధులు నిర్వహించారు. తాజా విజయంతో అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్‌ చరిత్ర సృష్టించనున్నారు. అలాగే ఆ పదవి చేపట్టనున్న తొలి నల్లజాతి, ఆఫ్రో అమెరికన్‌గానూ ఆమె ఘనత వహించనున్నారు.

1942లో అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌ ప్రాంతంలో బైడెన్‌ జన్మించారు బైడెన్. 1966లో బైడెన్‌ నీలియా హంటర్‌ను వివాహమాడారు. వారికి ముగ్గురు బైడెన్‌ 1972లో 29ఏండ్ల వయస్సులో డెలావర్‌ నుంచి మొట్టమొదటిసారి సెనేట్‌కు ఎన్నికయ్యారు. అతి తక్కువ వయస్సులో సెనేట్‌కు ఎన్నికైన ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 6 సార్లు సెనేట్‌కు ఎన్నికయ్యారు. ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో భార్య నీలియా, కూతురు నవోమీ చనిపోయారు. ఇద్దరు కుమారులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని బైడెన్‌ ఓ సందర్భంలో చెప్పారు.

తన భార్య నీలియా మరణానంతరం 1977లో ఆయన జిల్‌ జాకబ్స్‌ను రెండో పెండ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు. 1988లో బైడెన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయన ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. 2015లో బైడెన్‌ కుమారుడు బ్యూ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పుడే భార్య మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. ఆ సమయంలో బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

- Advertisement -