మా బాధ్యత ఇదే: బైడెన్

238
kamala
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో హోరాహోరిగా సాగిన పోరులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించి బైడెన్ గెలుపొందగా ఉపాధ్యక్షరాలు కయలా హ్యారిస్‌తో కలిసి ప్రజల నుద్దేశించి మాట్లాడారు బైడెన్.

కరోనా మహమ్మారి నియంత్రణకు తొలిరోజు నుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. కోపాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టాలి. ఒక జాతిగా దేశం కోసం ఒక్కటవ్వాల్సిన సమయం ఇది అని ప్రజలకు పిలుపు నిచ్చారు. అధ్యక్షుడిగా నా బాధ్యత దేశం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించడం అని పేర్కొన్నారు.

వైరస్‌ కట్టడికి తొలి రోజు నుంచే మా ప్రణాళికను అమలుచేస్తాం. చనిపోయిన వారిని అది తిరిగి తీసుకురాకపోవచ్చు అని తెలిపారు కమలా హ్యారిస్. మీరు నాకు ఓటు వేసినా, వేయకపోయనా, అమెరికన్లందరికీ నేను అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు బైడెన్.

- Advertisement -