కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరంకు గతంలోనే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 85వ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు రాహుల్ నేతృత్వంలో మరోసారి తూర్పు నుంచి పడమరకు ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలో జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పసిఘాట్ నుంచి పోరుబందర్ వరకు భారత్ జోడో యాత్ర జరగనున్నట్టు తెలిపారు. గతంతో పోల్చుకుంటే యాత్రలో పాల్గొన్న వారు కూడా కాస్త తక్కువగానే ఉండొచ్చని చెప్పారు. తూర్పు పడమరల మధ్య దట్టమైన అడవులు, నదులు ఉండటం వల్ల కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా మల్టీ మోడల్ యాత్రగా కార్యక్రమాన్ని రూపొందించే అవకాశముందన్నారు. అయితే ఎక్కువ భాగం మాత్రం పాదయాత్రే ఉంటుందని అన్నారు. అన్నీ అనుకూలిస్తే జూన్ ముందుగానీ నవంబరు తర్వాత గానీ యాత్ర చేపట్టే అవకాశాముందని జైరాం రమేష్ అన్నారు. దీన్నిపై మరికొన్ని రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి…