రిలయన్స్ జియో సంస్ధ కొత్త కొత్త ఆఫర్లతో వినియెగదారులను అట్రాక్ట్ చేస్తుంది. తక్కువ ధరకే ఇంటర్ నెట్ ఇవ్వడంతో పాటు కొత్త కొత్త ప్లాన్ లను విడుదల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్రస్తుతం జియో టాప్ నెంబర్ 1 లో కొనసాగుతుంది. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ ప్రకారం రూ.399 రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు వంద శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఎజియో (AJIO) కూపన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఎజియో ఆఫర్లకు తోడుగా ఈ కూపన్‌ను కూడా వాడుకోవచ్చు. కస్టమర్లు మైజియో యాప్‌లో తమ జియో నంబర్‌కు రూ.399తో రీచార్జ్ చేయిస్తే రిలయెన్స్ వెంటనే రూ.399 కూపన్‌ను మైకూపన్స్ సెక్షన్‌కు యాడ్ చేస్తుంది.
ఈ కూపన్‌ను ఎజియో యాప్ లేదా వెబ్‌సైట్‌లో వాడుకోవచ్చు. కనీసం రూ.వెయ్యి కొనుగోలుపై ఈ కూపన్‌ను వాడుకునే వీలుంటుంది. ఈ ఆఫర్ కొత్త, పాత కస్టమర్లు అందరికీ వర్తిస్తుంది. శుక్రవారం నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 31, 2019 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మార్చి 15లోపు కూపన్లను రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.