- Advertisement -
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ ఆర్ కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘జిలేబి’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. బ్యాంకాక్ లో రెండు పాటలని గ్రాండ్ గా చిత్రీకరించారు. దీంతో షూటింగ్ అంతా పూర్తయింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Also Read: ఎన్టీఆర్ తో అటు హిందీ ఇటు తెలుగు
రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Also Read: ఒక మంచి కథ చేశాం: స్వప్న ప్రియాంక దత్
- Advertisement -