రక్షణ మంత్రిని కలిసిన విజయ్ దేవరకొండ..

99
vijay
- Advertisement -

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ -పూరీ జగన్నాథ్ కాంబోలో ‘జనగణమన’ (జేజీఎమ్) పేరిట మరో భారీ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ‘జేజీఎమ్’ చిత్రబృందం ఈరోజు ఢిల్లీలో దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిశారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జూపల్లి రాము రావు, విషురెడ్డి తదితరులు రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు.

ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘జనగణమన’ చిత్ర విశేషాలను వారు రాజ్ నాథ్‌కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ ‘జేజీఎమ్’ టీమ్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చార్మీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పంచుకుంది.

- Advertisement -