నాని…జెర్సీ టీజర్

323
JERSEY Official Teaser
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని, మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం జెర్సీ. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

నీ వయసు ఇప్పుడు 36..అది ప్రొఫెషనల్ గేమ్‌ నుండి రిటైర్ అయ్యే వయసు అంటూ మొదలయ్యే టీజర్‌ అందరిని ఆకట్టుకుంటోంది.పిల్లలని ఆడించే వయసులో బ్యాటేందుకు బావా…ఎంత ప్రయత్నించిన ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు..అంటూ సాగే టీజర్‌ నాని స్టెమినాను చాటింది.

టీజర్‌లో నాని క్రికెట‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. ఈ సినిమా నానికి మ‌రో మంచి హిట్ అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో చాలా శిక్షణ తీసుకున్నాడ‌ని అన్నారు . నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -