పొత్తు పొడిచింది..బీజేపీకి నిద్రలేని రాత్రులే

258
sp bsp
- Advertisement -

దేశ ప్రయోజనలే లక్ష్యంగా యూపీలో పొత్తు పొడిచిందని ఇక మోడీ,అమిత్‌ షా నిద్రలేని రాత్రులు గడపబోతున్నారని తెలిపారు బీఎస్పీ చీఫ్ మాయావతి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ,బీఎస్పీ పొత్తుపై ఎస్పీ చీఫ్ అఖిలేష్‌తో సంయుక్త సమావేశం నిర్వహించిన మాయావతి ఇది దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం అని తెలిపారు.

యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు ఆమె తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు.

ఎస్పీ,బీఎస్పీ పొత్తుతో బీజేపీ గుండెళ్లో రైళ్లు పరుగడుతున్నాయని తెలిపారు మాయ. మోడీ పాలనపై రైతులు,నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. కొత్త సంవత్సరంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాం యూపీ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు ఉప ఎన్నికల స్పూర్తితో బీజేపీకి బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యాం కాంగ్రెస్,బీజేపీలు అవినీతిలో కురుకుపోయాయని మండిపడ్డారు

యూపీలో కాంగ్రెస్‌కు బలం లేదని.. బీజేపీ మతం పేరుతో చిచ్చుపెడుతోందని ఆరోపించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్. దేశ సమగ్రత కోసం ఎస్పీ బీఎస్పీ పనిచేస్తాయని ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేవుడు కూడా బాధపడ్డాడని తెలిపారు. అంబేద్కర్ స్పూర్తిని బీజేపీ ద్వంసం చేసిందని మండిపడ్డ అఖిలేష్‌ కులాలు మతాల పేరుతో యూపీలో ఎన్నో ఎన్‌కౌంటర్లు చేశారని దుయ్యబట్టారు. వ్యక్తిగతంగా మాపై కేంద్రం కక్ష గట్టిన భయపడమన్నారు.

- Advertisement -