టీఆర్ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే: జీవన్ రెడ్డి

398
jeevanreddy
- Advertisement -

నిజామాబాద్ ఎమ్మెల్సీఉప ఎన్నిక లో మా అభ్యర్థి కవిత గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ..దేశం లో ఫిరాయింపులకు కర్త ,కర్మ ,క్రియ కాంగ్రెస్ ,బీజేపీ లేని మండిపడ్డారు.

మొత్తం 824 మంది ఓటర్లలో మాకు 80 శాతం సభ్యులబలం ఉందని…గ్రెస్ ,బీజేపీ లకు బలం లేకున్నా అభ్యర్థులను దించి ఎన్నికల కమిషన్‌కు పోటాపోటీ పిర్యాదులు ఇస్తున్నాయని వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ,బీజేపీ లదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ ని ఫాదర్ ఆఫ్ డెఫెక్షన్ అని పిలువొచ్చన్న జీవన్ రెడ్డి….ప్రజల ఒత్తిడి తోనే స్థానిక ప్రజాప్రతినిధులు trs లో చేరుతున్నారని వెల్లడించారు. ఇది ఆపరేషన్ ఆకర్ష్ కాదు అభివృద్ధి ఆపరేషన్ అని 2007 లో కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇపుడు ఫిరాయింపుల పై నీతులు చెబుతోందన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తే పెద్దోల్లమవుతామని ,మీడియా లో నాలుగు వార్తలు వస్తాయని కాంగ్రెస్ నేతల ఆశ అని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి…….ఏ సమస్య లేని చోట సమస్య ను సృష్టించి వార్తల్లోకి ఎక్కాలన్నదే వారి ఆరాటం తప్ప మరొకటి కాదన్నారు.

టీఆర్ఎస్‌లోకి వలసలు అభివృద్ధి కోణం లొనే జరుగుతున్నాయి తప్ప మరే కారణం లేదని…..కాంగ్రెస్ నేతలవి అభూత కల్పనలు ,అసత్య ప్రచారాలు అని మండిపడ్డారు . కాంగ్రెస్ కు నిజామాబాద్ స్థానిక సంస్థల్లో తగినంత బలం లేకున్నా అభ్యర్థి ని ఎందుకు దింపింది ?ప్రలోభాలకు పాల్పడదామని అభ్యర్థిని దింపారా కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు.

బీజేపీ ఎన్నికల కమిషన్ కు మెమోరాండం ఇచ్చింది కనుక తామెక్కడ వెనుకబడిపోతామో అనే ఆరాటం తోనే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై పిర్యాదు చేస్తున్నారు తప్ప వారి ఆరోపణల్లో బలం లేదని వారికీ తెలుసు అన్నారు .

రేవంత్ ,షబ్బీర్ లాంటి వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఇక లేవదని ఓ నిర్ణయానికి వచ్చే ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు టి ఆర్ ఎస్ లో చేరుతున్నారని……తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ పై అభాండాలు వేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసినా ,అంతర్జాతీయ న్యాయస్థానానికి పిర్యాదు చేసినా తిమ్మిని బమ్మి మాత్రం చేయలేమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా కవితను ఎంతెంత భారీ మెజారిటీ తో గెలిపిద్దామా అని నిజామాబాద్ జిల్లా లో పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారని తెలిపారు జీవన్ రెడ్డి.

- Advertisement -