జేఈఈ మెయిన్‌-1 ..సత్తాచాటిన తెలంగాణ విద్యార్థులు

44
- Advertisement -

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం ఉదయం విడుదల చేసింది.

జేఈఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. విధిత్‌, సాయితేజ, అనూప్‌, దినేశ్‌ రెడ్డిలు 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్‌ పొందారు. సెషన్‌-2ను ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనుంది. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Also Read:టెస్టుల్లో వారి కథ ముగిసినట్లేనా ?

- Advertisement -