ప్రధాని రేసులో నితీష్…జేడీయూ క్లారిటీ!

56
nithish

మరోసారి ప్రధాని రేసులో నితీష్ కుమార్ ఉన్నట్లు వార్తలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్, జేడీయూ నేతలు స్పందించారు. ప్రధాని కావ‌డానికి బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు అన్ని ల‌క్షణాలు ఉన్నాయ‌ని, కానీ, ఆయ‌న ప్రధాని ప‌ద‌వి రేస్‌లో లేరని స్పష్టం చేసింది. ఇక, ఇదంతా నాన్సెన్స్ అని.. నేనెప్పుడు ఇది కోరుకోలేదు.. ఆశించ‌లేదు అని స్పష్టం చేశారు నితీష్‌ కుమార్.

బీహార్‌ రాజకీయాలతో పాటు,జాతీయ రాజకీయాల్లో నితీష్ కుమార్ స్పష్టమైన మార్క్ చూపించారు. ముఖ్యంగా బిహార్‌ అభివృద్ధిలో నితీష్ పాత్ర మరువలేనిది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం బీహార్‌ సీఎంగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రధానికి కావాల్సిన అర్హతలన్నీ నితీష్‌ కుమార్‌కు ఉన్నాయంటూ జేడీయూ పార్లమెంట‌రీ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారగా దీనిపై వివాదం నెలకొనగా ముందే క్లారిటీ ఇచ్చింది జేడీయూ.