పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం..

181
avani
- Advertisement -

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో భవీనా రజత పతకం సాధించగా తాజాగా భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అవని లేఖర 249.6 పాయింట్లు సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా డిసెంబరు 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఇరీనా షెట్నిక్ నమోదు చేసిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా అవని రికార్డులకెక్కింది. మొత్తంగా స్వర్ణం సాధించిన ఐదో మహిళగా చరిత్ర సృష్టించింది.

- Advertisement -