నా లైఫ్‌లో అద్భుతం జరిగింది…డియర్ మేఘ ట్రైలర్

178
dear megha
- Advertisement -

మేఘా ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజులు ప్రధాన పాత్రల్లో సుశాంత్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ మేఘ‌. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్‌ పొందింది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

డియర్‌ మేఘ.. నా లైఫ్‌లో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది అంటూ హీరో చెప్పే మాటలతో ట్రైల‌ర్ మొదలుకాగా తన ప్రేమను తనలో దాచుకుని బాధపడే ఓ అమ్మాయి కథే డియర్ మేఘ అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్య‌న్ నిర్మించారు.సెప్టెంబర్ 3న ఈ థియేటర్లలో రిలీజ్ కానుంది.

- Advertisement -