ఆ అధికారులను వదలను:జేసీ వార్నింగ్

3
- Advertisement -

వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..తమ కుటుంబాన్ని దొంగలుగా చిత్రీకరించి జైళ్లకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1 ఏప్రిల్ 2017 తర్వాత బీఎస్-4 వాహనాలు అమ్మకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఇది అనేక రాష్ర్టాల్లో హైకోర్టులు తీర్పునిచ్చాయి. తప్పుచేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగలు మాదిరి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బందులకు గురి చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కమిషనర్ సీతా రామాంజనేయులు, పేర్నినాని తో పాటు ఇతర అధికారులు ఎవ్వరిని వదలనని చెప్పారు. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఇంటి ముందు ధర్నా చేస్తానని..రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండులేనని ఆరోపణలు చేశారు.

Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

- Advertisement -