జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌కు మెట్రో..ముహుర్తం ఖరారు

584
hyderabad metro
- Advertisement -

హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్ అందించారు మెట్రో అధికారులు. ఇప్పటికే తొలిదశ నాగోల్ నుంచి హైటెక్‌ సిటీ,ఎల్బీ నగర్ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో పరుగులు పెడుతుండగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రోజుకు 2 నుంచి 3 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రోకు ప్రయాణీకుల రద్దీ మరింతగా పెరిగిపోయింది.

ఇక హైదరాబాద్ మెట్రో మొదటిదశ మూడు కారిడార్లలో రెండు కారిడార్లు ప్రారంభమైపోగా.. కారిడార్‌ 2 బ్యాలన్స్‌గా ఉంది. ఈ కారిడార్‌లో 15 కిలోమీటర్లకు గాను 10 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు నవంబర్‌లో మెట్రో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి విద్యుత్‌ తనిఖీలు పూర్తయ్యాయి. ట్రాక్‌, విద్యుత్‌ లైన్‌, అక్సిలరీ పవర్‌ సర్వీస్‌ స్టేషన్లు, టికెట్‌ మెషిన్స్‌తో సహా మెట్రోస్టేషన్లలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రూట్‌లో కేవలం ట్రయల్ రన్ చేయాల్సి ఉంది.. అది పూర్తయితే ఎంజీబీఎస్‌ నుంచి సుల్తాన్ బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్ మీదుగా జూబ్లీ బస్టేషన్‌ వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -