జయహో ఉప్పల ఫౌండేషన్

302
uppala foundation
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మౌలాలిలోని పేద వైశ్య కుటుంబానికి చెందిన పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి ఉప్పల శ్రీనివాస్ గారిని ట్విట్టర్ ద్వారా సహాయం కోరారు. సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్న తనకు లాక్ డౌన్ కారణంగా ఉపాధి పోయిందని, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న కారణంగా తనకు సాయం చేయాలని కోరారు. వెంటనే ఉప్పల శ్రీనివాస్ తన వివరాలు తెలపాలని ట్విట్టర్ లో కోరారు.

ఉప్పల ఫౌండేషన్ టీమ్ సభ్యులను తక్షణ సాయం చేయాలని ఆదేశించగా వారు రూ.5వేలు ఆర్ధిక సాయం చేశారు. ఉప్పల ఫౌండేషన్ చేసిన సాయానికి పెద్ది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

తన కుటుంబం ఎంతో కష్టాల్లో ఉందని, గౌరవనీయులైన ఉప్పల శ్రీనివాస్ కుటుంబానికి తమ కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పోస్ట్ కి స్పందించి సాయమందించిన ఉప్పల ఫౌండేషన్ కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

uppala foundation

- Advertisement -