బోయపాటి సినిమాకు 100 థియేటర్లు పెరిగాయి

213
Janaki Nayaka
- Advertisement -

బోయ‌పాటి శ్రీను – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వచ్చిన మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జ‌య జాన‌కి నాయ‌క‌ బాక్సాఫీస్ వద్ద మాస్ మూవీ స్పెషలిస్ట్ ల స్టామినా చాటుతోంది. బోయ‌పాటి తెర‌కెక్కించిన ఈ మూవీ ఆగ‌స్టు 11న రిలీజైన మూడు భారీ సినిమాల పోటీలో తనదైన సత్తా చాటుతోంది. లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాల‌కు పోటీగా రిలీజైన ఈ సినిమా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల మన్ననలు పొందుతోంది.

బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌, భారీ కాస్ట్, క‌ళ్లు చెదిరిపోయే ఫైట్స్, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ అందం, హై టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు సినిమా థియేటర్ల కొరతను ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదారు మరో 100 థియేటర్లు పెరిగినట్టు తెలుస్తోంది.మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు థియేటర్లు పెరిగిన కారణంగా ఈ వారం కలెక్షన్స్ సైతం పుంజుకుంటాయంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

- Advertisement -