ట్రైలర్‌ చూసి..జై కొట్టారు..

238
Kluniversity Celabrates balakrishna's Paisa Vasool
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. పైసా వసూల్ ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి.

ఇక ‘పైసా వసూల్’ ట్రైలర్ చూస్తే మొత్తం నందమూరి బాలకృష్ణే కనిపించాడు. ఆరంభం నుంచి చివరి దాకా బాలయ్యే హైలైట్ అయ్యాడు. బాలయ్య ఎనర్జీ.. ఆయన డైలాగులు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు వచ్చిన స్టంపర్‌లో సైతం బాలయ్య విశ్వరూపమే కనిపించింది. బాలయ్య నెవర్ బిఫోర్ అవతారంలో.. క్యారెక్టర్లో కనిపిస్తున్న ‘పైసా వసూల్’ నందమూరి అభిమానులకు విందు భోజనమే అయ్యేలా కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు కొంచెం కంగారు పెట్టిస్తున్నప్పటికీ.. ‘పైసా వసూల్’ అభిమానుల వరకు పైసా వసూల్ అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పైసా వసూల్’ ట్రైలర్ విషయంలో ఓవరాల్ ఫీడ్ బ్యాక్ ఓ మోస్తరుగా అనిపిస్తుంటే.. బాలయ్య అభిమానులు మాత్రం సినిమా పట్ల చాలా పాజిటివ్ గా ఉన్నారు. అంతేకాదు ఫ్యాన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ లోనూ ఈ ట్రైలర్ బాగానే ఆసక్తి రేకెత్తించినట్లు కనిపిస్తోంది.

Kluniversity Celabrates balakrishna's Paisa Vasool

మొన్న ట్రైలర్ రిలీజైన సందర్భంగా గుంటూరు దగ్గర్లోని కేఎల్ యూనివర్శిటీ హాస్టల్లో కుర్రాళ్ల హంగామా చూస్తే.. నందమూరి అభిమానులకే కాక సామాన్య ప్రేక్షకులకూ బాలయ్య 101 ఫీవర్ ఎక్కేసిందేమో అనిపిస్తోంది. భారీ భవంతుల్లో ఉన్న ఆ హాస్టల్ ప్రాంగణంలోని కుర్రాళ్లందరూ ‘పైసా వసూల్’ ట్రైలర్ చూసిన అనంతరం జై బాలయ్యా జైబాలయ్యా అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ హాస్టల్ ను హోరెత్తించేశారు. ఆ హంగామాను వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. అది ‘పైసా వసూల్’ దర్శకుడు పూరి జగన్నాథ్ వరకు వచ్చింది. దాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నాడు పూరి. ఈ వీడియో నందమూరి అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

- Advertisement -