ICC:ఐసీసీ ఛైర్మన్‌గా జై షా!

8
- Advertisement -

ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈ నెల 27తో ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ల పర్వం ముగియనుండగా ప్రస్తుత ఛైర్మన్ గ్రేగ్ బార్క్‌లే మరోసారి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీంతో ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా..ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది.

జైషాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మద్దతు ఉంది. దీంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమే కానుంది. గ్రెగ్ బార్క్లే 2020 నవంబర్‌లో స్వతంత్ర ఐసీసీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. 2022లో ఆయన తిరిగి ఎన్నికయ్యారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఛైర్మన్ ఎన్నికలో 16 ఓట్లు ఉంటాయి. ఛైర్మన్ గా ఎన్నిక కావాలంటే విజేతకు తొమ్మిది ఓట్ల సాధారణ మెజారిటీ అవసరం. ఇది జైషాకు నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు.

Also Read:దీపావళికి ”లక్కీ భాస్కర్”

- Advertisement -