ఐసీసీ ఛైర్మన్‌గా జై షా..బీసీసీఐ రేసులో రోహన్ జైట్లీ!

15
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బిసిసిఐ కార్యదర్శి జై షా. గ్రెగ్ బార్క్లే పదవీకాలం ముగిసిన తర్వాత జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుండగా జై షా డిసెంబర్‌ 1న బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇప్పటికే రెండు సార్లు ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బార్ క్లే మూడోసారి బరిలో నిలవకూడదని నిర్ణయం తీసుకోవడంతో జైషా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. క్రికెట్ ను మరింత విస్తృతం చేసేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జైషా ప్రకటించారు.

జై షా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో బీసీసీఐ కార్యదర్శిగా డిడిసిఎ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ కుమారుడే రోహన్ జైట్లీ.

జగ్‌మోహన్ దాల్మియా (అధ్యక్షుడు), శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, షాహంక్ మనోహర్ తర్వాత ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఐదవ భారతీయుడిగా జై షా నిలిచారు.

Also Read:CM Revanth: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

- Advertisement -