‘జవాన్’లో ఆ అమ్మాయిలే హీరోలు

25
- Advertisement -

జవాన్ సినిమాకు ఇద్దరు హీరోలు… ఒకరు కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’, మరొకరు ‘దర్శకుడు అట్లీ మరియు ఆరుగురు అమ్మాయిలు’. షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సంజయ్ దత్, సన్యా మల్హోత్రా, యోగి బాబు ఇలా పలు భాషల్లో పాపులర్ నటీనటులు వీరంతా. జవాన్ సినిమాలోని ప్రధానపాత్ర దారులు వీరు. ఆయా భాషల్లో మార్కెటింగ్, వసూళ్ల అడ్వాంటేజ్ కోసం, ఆయా రాష్ట్రాల నేటివిటీని కృత్రిమంగా అద్దే ప్రయాసే ఈ నటీనటుల ఎంపిక. కానీ దర్శకుడు అట్లీని ఓ విషయంలో మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం మాలాంటి క్రిటిక్స్. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాలో మహిళా నటీమణులు జీరోలుగానే ఉంటారు.

వారికీ, వారి పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదు. ఎవరికీ పెద్ద ప్రాధాన్యమున్న పాత్ర కూడా ఉండదు. జవాన్ సినిమాలో ఏకంగా ఆరుగురు అమ్మాయిలు తమ హీరోయిజం చూపించారు. సినిమాలో షారుఖ్ గురించే అందరూ ఊదరగొడుతున్నారు గానీ, అమ్మాయిల పాత్రలను కూడా మెచ్చుకొని తీరాలి. నయనతార, దీపికా పదుకొణె సంగతి పక్కన పెడితే.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య.. ఇలా ప్రతి అమ్మాయి తన పాత్రలోని రౌద్రంతో అదరగొట్టింది. సినిమాలో వీరంతా ఉన్న ఫ్రేమ్ కూడా నిండుగా కలర్ ఫుల్ గా ఉంది.

Also Read:‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ పరిస్థితేంటి ?

నిజానికి కొన్ని షాట్స్ లో అయితే ఈ అమ్మాయిలు షారుఖ్ ఖాన్ ను కూడా డామినేట్ చేశారు. ఈ మాట ఏదో మాట వరసకు అనడం లేదు. ఆ అమ్మాయిలు నిజంగానే తమ ముద్రను వేసుకున్నారు. అసలు జవాన్ సినిమా మొత్తం షారుఖ్ ఖాన్ హీరోయిజం చుట్టూ తిరుగుతుంది… మిగతావాళ్లు ఆయా ఎలివేషన్స్ కి తగ్గట్టూ కనిపించడమే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమకంటూ ప్రత్యేకతను – గుర్తింపును తెచ్చుకోవడం అంత ఈజీ కాదు కదా. కానీ, దర్శకుడు అట్లీ, ఆ ఆరుగురు అమ్మాయిలు ఆ విజయాన్ని సాధించారు. ఇక జవాన్ తో షారుఖ్ ఖాన్ సరికొత్త రికార్డ్స్ ను బ్రేక్ చేయబోతున్నాడు.

Also Read:భారత్ పేరు మార్పుపై ఐరాస!

- Advertisement -