తిక్క , విన్నర్,నక్షత్ర్రం ప్లాప్‌ల తర్వాత భారీ ఆశలతో సాయి ధరం తేజ్ చేసిన మూవీ జవాన్. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. టాలీవుడ్‌లో గొల్డెన్ లెగ్ అని పేరు పడిన మెహ్రీన్ ఫిర్జాదా…తేజు సరసన హీరోయిన్‌గా నటించడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి..మరి జవాన్‌పై ఆశలు పెట్టుకున్న తేజుకి ఈ సినిమా సక్సెస్‌నిచ్చిందా..? ప్రేక్షకులను మెప్పించిందా లేదా చూద్దాం..
కథ:
జై (సాయిధరమ్‌తేజ్), కేశవ(ప్రసన్న) మంచి స్నేహితులు. జై నిజాయతీగా ఉంటాడు. దేశమంటే ఇష్టం. కేశవ తన స్వార్థం తాను చూసుకుంటూ ఉంటాడు. భిన్న మనస్తత్వాల వల్ల వీరిద్దరూ చిన్నప్పుడే విడిపోతారు.శాస్త్రవేత్త కావాలన్నది జై ఆశయం కాగా కేశవ మాత్రం మాఫియాతో చేతులుకలుపుతాడు. ఈ నేపథ్యంలో ఆక్టోపస్ మిసైల్‌ని విదేశాలకు అమ్మేయాలని చూస్తుంటాడు.. ఈ ప్రయత్నాన్ని జై ఎలా తిప్పి కొట్టాడు? కేశవను ఎలా అడ్డుకున్నాడన్నదే అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మాటలు,హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు. సాయి ధరమ్ తేజ్ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. జై పాత్రలో ఒదిగిపోయాడు.పాటలు,ఫైట్స్,కీలక సన్నివేశాల్లో తేజు తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. జవాన్ చిత్రానికి వెన్నముక కేశవ్ పాత్ర. కేశవ్ పాత్రలో తమిళ నటుడు ప్రసన్న చక్కటి విలనిజాన్ని పండించాడు. మెహ్రీన్ మరోసారి తన గ్లామర్‌తో ఆకట్టకుంది. అందాల ఆరబోత,రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది.కీలక పాత్రల్లో కోటా శ్రీనివాసరావు, నాగబాబు, జయప్రకాశ్, సత్యం రాజేశ్, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కామెడీ లేకపోవడం,కథను వదిలేసి కమర్షియల్ హంగుల కోసం పాకులాడటం. ఫస్టాఫ్ లో స్క్రిప్టు చాలా గందరగోళంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కేశవ్, జై పాత్రల మధ్య నడిచే మైండ్ గేమ్ ఆసక్తికరంగా సాగుతుంది. కానీ ఈ మధ్యలో వచ్చిన ధ్రువ్ చిత్రం ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. అయినా జవాన్ ఏదో మంచి ట్రాక్‌లో వెళ్తుందని ఓ ఫీలింగ్ పుట్టగానే రొటీన్ క్లైమాక్స్‌తో ప్రేక్షకుడి ఆసక్తిపై నీళ్లు చల్లాడనే భావన ఏర్పడటం మరో ప్రధాన లోపం.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. తమన్ అందించిన సంగీతం బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడు బీవీఎస్ రవి తన ఇంటెలిజెన్స్‌ను చూపించడానికి ప్రయత్నించాడు. స్క్రీన్‌ప్లే ప్రధానమైన కథ ఇది. మైండ్‌గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలను బాగా రాసుకోగలిగాడు. దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కె.వి.గుహన్ కెమెరా, నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
దేశభక్తి ప్రధాన నేపథ్యంగా ఇద్దరు బలమైన, తెలివైన వాళ్ల మధ్య సాగే మైండ్ గేమ్ కాన్సెప్ట్ జవాన్. తేజు,ప్రసన్న నటన,డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కామెడీ లేకపోవడం, కమర్షియల్ హంగుల కోసం పాకులాడటం సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఒకటిగా నిలిచే మూవీ..జవాన్.
విడుదల తేదీ:01/12/2017
రేటింగ్:2.5/5
నటీనటులు: సాయిధరమ్‌తేజ్,మెహరీన్
సంగీతం: తమన్
నిర్మాత: కృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీవీఎస్ రవి