ఇటివలే వెస్టిండిస్ తో సిరిస్ ముగించుకున్న ఇండియా జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఆపై, జనవరి 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. ఈ రెండు పర్యటనల కోసం వేర్వేరుగా జట్లను ప్రకటించారు సెలక్టర్లు. ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఓపెనర్ ధావన్ , పేసర్ బుమ్రాలకు ఈ రెండు మ్యాచ్ లలో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముగ్గురు ఓపెనర్లను ఎంపిక చేశామని.. లంకతో టీ20 సిరీస్‌కు శాంసన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేశామని ఎమ్మెక్కే ప్రసాద్ తెలిపారు.
సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య గురించి జనవరి మూడో వారంలో ఆలోచిస్తామని చెప్పారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఇదే చివరి ఎంపిక కావడం విశేషం. కాగా వరల్డ్ కప్ నుంచి విరామం లేకుండా మ్యాచ్ లు ఆడుతున్న టీంఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కు ఈ రెండు సిరీస్ లలో విశ్రాంతి ఇచ్చారు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివమ్ దూబే, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, మనీశ్ పాండే, సంజూ శాంసన్