నిరాడంబరంగా బుమ్రా వివాహం..

311
bumra
- Advertisement -

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. గోవాలో ఇవాళ మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ని పెళ్లి చేసుకోగా కరోనా నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన జీవితంలోనే ఇవాళ అత్యంత ఆనందకరమైన రోజు అంటూ పేర్కొన్నారు బుమ్రా.

గ‌త కొన్ని రోజులుగా బుమ్రా, సంజ‌న సోష‌ల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జ‌రిగిన చివ‌రి టెస్ట్‌తోపాటు టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాల‌ని బుమ్రా నిర్ణ‌యించిన‌ప్ప‌టి నుంచీ అత‌ని పెళ్లిపై వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌ట్లో టాలీవుడ్ న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను అత‌డు పెళ్లి చేసుకోబోతున్నాడ‌నీ వార్త‌లు వ‌చ్చినా.. వీటిని ఆమె త‌ల్లి ఖండించ‌డంతో ఆ పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. అయితే చివరకు వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

- Advertisement -