బుమ్రా ప్రమాదకారి: కివీస్ కెప్టెన్

346
bumra
- Advertisement -

కివీస్‌తో సిరీస్‌లో ఫ్లాప్ షో కనబర్చాడు భారత స్టార్ బౌలర్ బుమ్రా. ఈ సిరీస్‌లో బుమ్రా ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా భారత బౌలర్‌కు మద్దతుగా నిలిచాడు కీవిస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌.

బుమ్రా ప్రమాదకర బౌలర్‌ అని అయితే అతని బౌలింగ్‌లో కాస్త పదును పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు కేన్. అన్ని ఫార్మాట్‌లో ఇప్పటికే బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్‌గా తనేంటో నిరూపించుకున్న విషయం అందరికి తెలుసన్నారు. బుమ్రా విషయంలో టీమిండియాకు ఎలాంటి అనుమానాలు వద్దని ఏ సమయంలోనైనా పుంజుకోగలడని సూచించాడు.

కివీస్‌తో సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు బుమ్రా. భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

- Advertisement -