JAPAN:జపాన్ ప్రధానిపై బాంబు దాడి…

33
- Advertisement -

జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై గుర్తుతెలయని వ్యక్తి స్మోక్ బాంబు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వకయామా సిటీలో సైకాజికి పోర్ట్‌లో పర్యటనలో భాగంగా… అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించే ముందు కొన్ని సెకన్ల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధానిని వెంటనే అక్కడే నుంచి సురక్షిత ప్రాంతంకు తరలించారు. ఈ ఘటనలో ప్రధానికి ఏలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు దృవీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మాజీ ప్రధాని షింజోఅబే ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబే…చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుత ప్రధానిపై కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో జీ7దేశాల సమావేశం ఉన్నందున్న ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో భద్రతాపరమైన ఆంశాలపై తీవ్ర కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి…

కులంను చూసి ఈపీఎస్‌ను సీఎం చేయలేదు:శశికళ

కులాంతర వివాహం చేసుకునే వారికి.. అద్భుత పథకం!

నిద్ర లేమితో నష్టాలు..

- Advertisement -