సౌత్‌ అంటే ఇష్టం అంటూనే పూరికి ‘నో’ చెప్పారు..

604
- Advertisement -

జాన్వీ కపూర్‌కు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని స్పష్టం చేశారు బాలీవుడు నిర్మాత,నటుడు బోనీ కపూర్‌. జాన్వీకి సౌత్ సినిమాలంటే ఇష్టం లేదని అందుకే వరుస ఆఫర్లను తిరస్కరిస్తోందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఆయన తమ కుటుంబానికి దక్షిణాదితో విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

శ్రీదేవి సౌత్‌లో అగ్రహీరోలందరితో నటించిందని తెలిపిన బోనీ తమ కుటుంబానికి కృష్ణ,చిరంజీవి ఫ్యామిలీలతో మంచి రిలేషన్‌ షిప్ ఉందన్నారు. కథ నచ్చితే సౌత్‌లో జాన్వీ నటించేందుకు సిద్దమని చెప్పారు.

janvi kapoor

విజయ్‌ దేవరకొండ-పూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో జాన్వీ నటిస్తుందని వార్తలు వెలువడుతుండగా ఈ ఆఫర్‌ని తిరస్కరించారు జాన్వీ. గతంలో మహేష్‌ బాబు,రామ్ చరణ్‌ సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన వాటిని తిరస్కరించింది జాన్వీ. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలో నటించేందుకు శ్రీదేవి కూతరు జాన్వీకి ఇష్టంలేదని వార్తలు వెలువడుతుండగా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బోనీ కపూర్.

- Advertisement -