ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చేయేడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా ఒక కొత్త వాహనంను కూడా సిద్దం చేశారు. అయితే ఆదిలోనే అనేక అడ్డంకులు సృష్టించిన అవన్ని పూర్తిగా తొలిగిపోయాయి. దీంతో జనసేనాని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రచార రథంకు వారాహి అని పేరు పెట్టారు. అయితే వారాహికి ఆలివ్ గ్రీన్ కలర్ పెయింట్ వేశారని అనేక ఆరోపణలు వచ్చిన వాటిన్నంటిని పటాపంచలు చేశారు. దీంతో అది ఆలివ్ గ్రీన్ కాదని…ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులకు వివరణ ఇచ్చారు. దీంతో వారాహి రిజిస్ట్రేషన్‌కు కూడా పూర్తయింది. వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారు.
ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. వారాహి అంటే అమ్మవారి పేరని… వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. మరియు ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అయితే పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి తొలి పూజ చేయనున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. వచ్చే యేడాది జనవరి 2 ఏకాదశి రోజున ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా దీని కోసం పవన్ కొండగట్టుకు రానున్నట్టు తెలుస్తుంది. ఏపీలోని బెజవాడ కనకదుర్గ ఆలయంలోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూజల అనంతరం ఏపీలో ఎన్నికల యుద్ధానికి జనసేనాని బయలుదేరనున్నారు.
వారాహి వాహనంను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను ప్రత్యేక సర్వర్‌కు రియల్ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్ మెట్లు ఉంటాయి.
ఇవి కూడా చదవండి…
అందుకే అన్‌స్టాపబుల్ షోకి ప్యాకేజీ పవన్!
హోదా ఇవ్వండి మోడీజీ ; సిఎం జగన్!
టీడీపీతో పొత్తు.. పవన్ క్లారిటీ ఇస్తారా?