చంద్రబాబుకు జనసేన దెబ్బ!

32
- Advertisement -

ఏపీలో టీడీపీ జనసేన పార్టీల మద్య ఎప్పుడు ఎలాంటి పరిణాలలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఈ రెండు పార్టీలు పొత్తుకోసం తాపత్రయ పడుతున్నాయి. అధినేతలు ఇద్దరు కూడా పొత్తు కన్ఫర్మ్ అన్న రీతిలోనే మెలుగుతూ వచ్చారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. రెండు పార్టీల మద్య సీట్ల పంపకాల విషయంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. దాంతో పవన్ మరియు చంద్రబాబు పొత్తు ప్రస్తావన లేకుండా నియోజిక వర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించడం మొదలు పెట్టారు. దీన్ని బట్టి చూస్తే పొత్తు దాదాపుగా లేనట్లేననే సందేహాలు వ్యక్తమౌతున్నాయి..

ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన పార్టీ వల్ల టీడీపీకి గట్టిగానే దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలోని పలువురు అసంతృప్త నేతలు జనసేన గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని టీడీపీ నాయకురాలు పడాల అరుణ జనసేన పార్టీలో చేరారు. ఈమె గతంలో గజపతిపురం నియోజిక వర్గం నుంచి టీడీపీ తరుపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2021 లో పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు గణపరిపురం నియోజిక వర్గంలో కీలక నేతగా ఉన్న పడాల అరుణ జనసేనలో చేరడంతో అక్కడ పార్టీ బలం పెంచుకునే అవకాశం ఉంది.

Also Read:ఆ దర్శకుడితో పవన్‌కి గొడవ!

అంతే కాకుండా ఇదే నియోజిక వర్గం నుంచి ఆమె జనసేన తరుపున పోటీ చేసిన ఆశ్చర్యం లేదు. ఈ పరిణామాలు టీడీపీని కొంత కలవర పెట్టె అంశాలే. ఇంకా మరికొంత మంది టీడీపీ నేతలుకూడా జనసేన గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి. దీంతో పొత్తు సంగతి అటుంచితే ప్రస్తుతం జనసేన పార్టీ వల్ల టీడీపీకి గట్టిగానే ముప్పు పొంచ్చిఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ కూడా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా జనసేన పార్టీనే ప్రధాన ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెల్లగా టీడీపీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -