2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. గెలుపు ఓటములతో సంబంధం లేదని..నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. జనసేన మొదటి ఆఫీసు అనంతపురంలోనే ప్రారంభిస్తానని అన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీమాంధ్రహక్కుల చైతన్య సభలో మాట్లాడిన పవన్….సమస్యలకు బయపడే వ్యక్తిని కాదని..వారికోసం ఎంతవరకైనా పోరాడుతానని తెలిపారు.
హోదాపై అరుణ్ జైట్లీ,వెంకయ్య నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పవన్ ప్రశ్నించారు. తొలుత మృతి చెందిన భారత సైనికులకు పవన్ నివాళులర్పించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఉండలేనని స్పష్టం చేశారు. హోదా ముగిసిన అధ్యాయం కాదు….సరికొత్త అధ్యాయానికి చిరునామా అన్నారు.
అనంతపుర్ లో పరిశ్రమలు పెట్టాలంటే నీరు కావాలని..నీరు లేకుండా ఎలా పరిశ్రమలు పెడుతారని ప్రశ్నించారు. పోరాటం చేస్తం మడమ తిప్పమని స్పష్టం చేశారు. ప్యాకేజీలో మనకు ఇచ్చింది ఏమి లేదన్నారు. అవసరమైతే మోడీని ఎదురించడానికి సిద్ధమని ప్రకటించారు. మాట మీద నిలబడకుంటే కూలదోస్తామని పవన్ స్పష్టం చేశారు.ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేస్తున్నట్లు కేంద్రం వైఖరి ఉందన్నారు. స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేటప్పుడు కేంద్రానికి క్లారిటీ లేదన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే చేస్తే ఏం చేయాలో మాకు తెలుసని హెచ్చరించారు. రాష్ట్రానికి నిధులు వస్తాయని ఆనాడు మద్దతిచ్చానని…ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు ఉరుకోనని స్పష్టం చేశారు. పోలవరం ఏవిధంగా జాతీయ ప్రాజెక్టు అయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కులం,మతం,ప్రాంతాలకు అతీతంగా అందరికోసం పోరాడతానని తెలిపారు.
సీమాంధ్రుల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వాల మూలాలు, పునాదులు ప్రజల దగ్గరే ఉన్నాయని, వారిని ఎన్నుకునేది ప్రజలేనని పవన్ కల్యాణ్ అన్నారు. నాయకులు ప్రజలకు అండగా నిలబడకపోతే ఆ వ్యవస్థను కూల్చేస్తామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఒక్కోలెక్క చెప్పారని ఒకరు 2లక్షల 23 కోట్లంటే మరొకరు మరో లెక్కచెప్పారని, వారి మాటల మధ్యే అంత వ్యత్యాసం ఉందని అన్నారు.
‘రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టారో… చీకటి గదుల్లో రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేశారో ఇప్పుడు కూడా ప్రత్యేక హోదాపై అదే పరిస్థితి తీసుకొచ్చారు.. హోదాకి చట్ట బద్ధత కావాలి. కేంద్ర ఆర్థిక సంఘం 1 లక్ష 75 వేల కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తుంది… స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినా ఇవ్వకపోయిన మనకు రావాల్సిన ప్యాకేజీ ఇది. ఇంటి వాడికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసిన ఆహా ఆంధ్ర భోజా ఓహో ఆంధ్ర భోజా అంటూ సన్మానాలు చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.