జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నారు. ఆయన అక్కడ ప్రశాంతంగా పూర్తిగా ఆథ్యాత్మిక చింతనతో తిరుమలలో గుడపుతున్నారు. ఒంటరిగానే ఆయన స్వామి దర్శనం చేసుకుంటున్నారు. విఐపి దర్శనంలో కాకుండా పవన్ కళ్యాణ్ సాధారణ మనిషి లాగే మెట్లపై నడుచుకుంటూ వెళ్లి ఆయన స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తన వెంట ఎవరిని తీసుకురాకుండా ప్రశాంతత కోసం ఏకాంతంగా గడుపుతున్నారు. గోగర్భం జలాశయం సమీపంలో ఉన్న హంపీ మఠంలో ఆయన బస చేశారు.
దర్శనం అనంతరం కూడా ఆయన గదిలోకి ఎవరిని రానివ్వకుండా ప్రశాంతంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను చూడడానికి అభిమానలు పెద్ద ఎత్తున కొండపైకి వచ్చారు. దింతో తిరుమల ప్రాంతం పవన్ కళ్యాణ్ అభిమానులతో కిక్కిరిపోయింది. ఈ సందర్భంగా బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడగగా వాటికి సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దేవుడి సన్నిధిలోకి వచ్చానని ఇక్కడ రాజకీయాల గురించి ఏం మాట్లాడదలచుకోలేదన్నారు.
దేవుడి సన్నిధిలో ఆథ్యాత్మిక విషయాలను మాత్రమే మాట్లాడుతానని తెలిపారు. ఇతర విషయాలు తన వద్ద ప్రస్తావించ వద్దని మిడీయా ప్రతినిధులను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతితో నాకు చాలా అనుబంధం ఉందన్నారు. తిరుపతి అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. కొండపై ఉన్న యోగనరసింహస్వామి ఆలయం వద్ద తనకు నామకరణం, అన్నప్రాసన చేశారని గుర్తు చేసకున్నారు. ఈ రోజు కూడా స్వామి వారి సన్నిధిలో ప్రశాంతంగా గడుపుతానని..రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వెళ్లునున్నట్లు తెలిపారు.