2000 వేల నోటు రద్దు ?

53
- Advertisement -

దేశంలో గత రెండేళ్లుగా రెండువేల నోట్ల చలామణి చాలావరకు తగ్గింది. దీంతో 2000 వేల నోట్లను రద్దు చేయబోతున్నారా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. దాంతో చలామణిలో ఉన్న రెండు వేల నోట్లను దుకాణా దారులకు ఇస్తే తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే 2000లో నోట్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని, అవి చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ పలు మార్లు వెల్లడించింది. అయినప్పటికి రెండువేల నోటుపై ఉన్న అపోహలు మాత్రం తొలగడం లేదు. 2016 నవంబర్ 08 న అప్పుడు చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

వాటి స్థానంలో 500, 2000 వేల నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రారంభంలో 500 నోటు తో పాటు 2000 వేల నోట్లు కూడా చలామణిలో ఉండగా ప్రస్తుతం మాత్రం 2000 నోట్లు కనిపించడం లేదు. నోట్ల రద్దు సమయంలో ఏర్పడే అవాంతరాలను అదిగమించేందుకు అత్యవసర పరిస్థితుల్లో 2000 నోటును మార్కెట్ లోకి తీసుకొచ్చి ఆ తరువాత వీటి ప్రింటింగ్ ను దశల వారీగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2000 నోట్లు చలామణిలోనే ఉన్నాయని అవి రద్దు కాలేదని ఆర్బీఐ ప్రకటించిన సంబర్భాలు చాలానే ఉన్నాయి.

ఇదిలా ఉంచితే 2000 నోట్లను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ గత కొంత కాలంగా గట్టిగా వినిపిస్తోంది. రెండువేల నోట్ల వల్ల ఆర్థిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని, చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారని కొందరి అభిప్రాయం. లంచాలకు పాల్పడే వారికి, నగదు మోసాలకు పాల్పడే వారికి రెండు వేల నోట్ల రూపంలో నగదు తీసుకోవడం వల్ల నోట్ల సంఖ్య తగ్గి వారి పని ఈజీ అయిపోతుంది. అందుకే 2 వేల నోటు వల్ల లాభాల కంటే కూడా నష్టాలే అధికంగా ఉన్నాయనేది కొందరి అంచనా. అందుకే దశల వారీగా రెండు వేల నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ నిలిపివేసినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో 2000 నోట్లను రద్దు చేస్తారా లేదా వాటి స్థానంలో మరొక నోట్లను ప్రవేశ పెడతారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి…

రాహుల్ ” మరో యాత్ర “.. జోడో ఇచ్చిన జోష్ !

ఇంటింటికి టీడీపీ.. చంద్రబాబు ప్లాన్ ఫలించేనా?

స్థిరంగా బంగారం ధరలు..

- Advertisement -