రేపు శాసన సభ లో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చింది బీ ఆర్ ఎస్ శాసనా సభా పక్షం.శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు.
సభలో తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని సభాపతిని హరీశ్‌రావు కోరారు. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందన్న సమాచారం నేపథ్యంలోనే తమకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి కోరారు.
ప్రభుత్వ శాఖలన్నింటిపైనా శ్వేత పత్రాలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బుధవారం జరగబోయే శాసనసభ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Also Read:KTR:తెలంగాణలోనూ కర్ణాటక పరిస్థితే

