టెథాన్‌లో విద్యుత్తు వెలుగులు

63
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75యేళ్లు గడిచిన మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కొరవడింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఈ కొరత తీవ్రంగా ఉంది. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకశ్మీర్‌లో మౌలిక వసతుల కల్పన అక్కడి ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపలేకపోయాయి. దీంతో 2019లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత…అక్కడకి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి.

అనంతనాగ్‌ జిల్లా డూరు బ్లాక్ పరిధిలోని టెథాన్‌లో సుమారు 200మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్మెంట్‌ ప్యాకేజీ స్కీమ్‌లో భాగంగా విద్యుత్తు సరఫరాను అందించారు. గ్రామంలో 75యేళ్ల తర్వాత తొలి విద్యుత్తు దీపం వెలిగింది. ఇక తమ ఇళ్లలో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు మురిసిపోతున్నారు.

ఇప్పటి వరకు తమ అవసరాల కోసం సంప్రదాయ కలప దీపాలను వాడేవారమని ఇప్పడు విద్యుత్తు రావడంతో చాలా సంతోషంగా ఉందని ఫాజుల్‌ ఉదిన్ ఖాన్‌ అనే గ్రామస్థుడు తెలిపారు. అయితే గ్రామంలోని ప్రజలు విద్యుత్తు కాంతులను చూసి డ్యాన్సులు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి…

ఖండాంతరాలకు వ్యాపించిన గ్రీన్ ఛాలెంజ్…

సీఎం కేసీఆర్‌ రైతన్న నేస్తం:హరీశ్‌

బ్రెజిల్ విధ్వంసంపై ప్రధాని మోడీ..

- Advertisement -