కేంద్ర ప్రభుత్వం ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ నినాదంతో జమిలి ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్స్ ఖర్చులు తగ్గించడానికే జమిలి ఎలక్షన్స్ అని కమలనాథులు చెబుతున్నప్పటికి.. ఇందులో మాస్టర్ ప్లాన్ ఉందనేది జగమెరిగిన సత్యం. కమలనాథులు ఏ నిర్ణయం తీసుకున్న, ఎలాంటి వ్యూహరచన చేసిన అందులో స్వలాభం పార్టీ లాభం ఉండేలా చూసుకుంటారు. అలాంటిది ఏకంగా జమిలి ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తున్నారంటే.. దీని వెనుక ఎంత పెద్ద కాషాయ ప్లాన్ ఉందనేది ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి..
ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేందుకే మోడి సర్కార్ జమిలి ఎలక్షన్స్ వైపు వెళుతోందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోందటే. ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మద్య ప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ ఈ ఐదు రాష్ట్రాలలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. తెలంగాణ, మిజోరాం వంటి రాష్ట్రాల్లో అసలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనివార్యం.
ఇది గ్రహించిన బీజేపీ పెద్దలు వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని గ్రహించి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు జరిపితే బీజేపీకి కలిసొస్తుందని జమిలి ఎలక్షన్స్ ప్రతిపాదనను కేంద్ర పెద్దలు తెరపైకి తీసుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే బీజేపీ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాలన్నిటిని ఒకే తాటిపైకి తీసుకురావడం అంతా తేలికైన విషయం కాదు. దానికి తోడు రాజ్యంగా సవరణలు కూడా చేయాల్సిన పరిస్థితి. మరి ఎలక్షన్స్ పై బీజేపీ సీక్రెట్ స్ట్రాటజీ ఎంతవరుకు సక్సస్ అవుతుందో చూడాలి.
Also Read:చంద్రబాబు అరెస్ట్ లో మోడీ పాత్ర ఉందా?