చంద్రబాబు అరెస్ట్ లో మోడీ పాత్ర ఉందా?

56
- Advertisement -

చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ సర్కార్ హస్తం ఉందా ? దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన చంద్రబాబు అరెస్ట్ పై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది ? అసలు టిడిపి విషయంలో బిజెపి పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం హాట్ హాట్ డిబేట్లకు కారణమౌతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడూ స్కిల్ డెవలప్ మెంట్ లో దాదాపు రూ.300 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి విధితమే. అయితే బాబుపై తప్పుడు ఆధారాలు చూపి అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు వాపోతుంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. .

కాగా చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ సర్కార్ ఉందనేది జరగమెరిగిన సత్యం. అయితే ఈ అరెస్ట్ కు కేంద్రం సహకారం కూడా ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఓ మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలఃతో జైలుపాలు కావడం ఇదే మొదటిసారి. పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఐడీ మొదటి రిమాండ్ లో ఆయన పేరెందుకు చేర్చలేదు ? మొదట ఏ1 గా చిత్రీకరించిన సీఐడీ ఆ తరువాత చంద్రబాబును ఏ30 గా పరిగణించింది.

ఇవన్నీ పరిశీలిస్తే ఉద్దేశ్యపూర్వకంగా బాబు ను అరెస్ట్ చేశారనేది కొందరి వాదన. అయితే కేంద్ర సహకారం లేకుండా ఈ అరెస్ట్ సాధ్యమయ్యే పనికాదనేది మరికొందరి అభిప్రాయం. అందుకే బాబు అరెస్ట్ పై కేంద్ర పెద్దలు ఏ మాత్రం స్పందించలేదు. ఏపీ బీజేపీ నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ టీడీపీ మద్య పొత్తు అంశం తరచూ చర్చకు వచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తున్న తిరుతో.. ఆ పార్టీకి పూర్తిగా దూరంగా ఉండాలని టీడీపీ భావిస్తోందట. దాంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Also Read:Bigg Boss 7 Telugu:ఎపిసోడ్ 9 హైలైట్స్

- Advertisement -