అయ్యో.. సూపర్ స్టార్ కి షోల్డర్ సమస్య

220
- Advertisement -

యాక్షన్ హీరోలుగా చలామణి అవుతున్న వారు తమ సినిమాల్లో చేసే ఫైట్ లు చాలా రిస్క్ తో కూడుకున్నవి. వయసులో ఉన్నప్పుడు రిస్కీ స్టంట్స్ చేసినా బాడీ సహకరిస్తోంది. కానీ, వయసు అయిపోయాక, 60 దాటాక కూడా అదే రిస్కీ షాట్స్ అండ్ ఫైట్స్ చేస్తాను అంటే.. బాడీ పెయిన్స్ ఊరుకోవు. ముఖ్యంగా రోప్ లు కట్టుకుని చేసే ఫైట్ లు సీనియర్ హీరోలు మానుకోవాలి. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అతీతులు కారు.

ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా రాబోతున్న జైలర్ సినిమా గురించే ఇదంతా. జైలర్ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నాడు రజినీ. ఈ క్రమంలో సూపర్ స్టార్ కి షోల్డర్ సమస్య వచ్చింది. అసలు రజినీకాంత్ గత కొన్నేళ్లుగా నడుంనొప్పులతో బాధపడడానికి కీలక కారణం ఈ రోప్ ఫైట్లే. అలాగే గతంలో లెగ్ ఇంజ‌రీ, షోల్డర్ ఇంజ‌రీల బారిన కూడా పడ్డాడు.

లేటెస్ట్ గా మళ్ళీ రజినీకాంత్ కి షోల్డర్ సమస్య వచ్చింది. ప్రస్తుతం వైద్యులు రజనీకాంత్ ను నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజినీ లేని సీన్స్ ను షూట్ చేసేలా షెడ్యూల్ ను మార్చుకోబోతున్నాడు. ఇక ఈ లోపు రజనీకాంత్ కి ఈ షోల్డర్ సమస్య తగ్గిపోవాలి. అదే విధంగా సూపర్ స్టార్ కాస్త మేకోవర్ కావాలి. అప్పుడు కానీ రజనీ మళ్లీ సినిమా షూట్ జోలికి వెళ్లకపోవచ్చు.

ఇవి కూడా చదవండి…

వీరసింహారెడ్డి..మాబావ మనోభావాలు

ధమాకా డే వన్ కలెక్షన్స్ ఎంతంటే?

వీరసింహారెడ్డికి రెండు ఈవెంట్ లు !

- Advertisement -