సుక్కు , విజయ్ దేవరకొండ లేనట్టే?

225
- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇటివలే విజయ్ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టరయింది. ఇక, సమంత అనారోగ్యం కారణంగా విజయ్ చేస్తున్న ఖుషి షూటింగ్ ఆగిపోయింది.

గతంలో విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయింది. ఫాల్కన్ క్రియేషన్స్ ఈ కాంబో సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని తెలుస్తుంది.

సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పై దృష్టి పెట్టాడు. నెక్స్ట్ రాం చరణ్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. సుకుమార్‌ నెక్స్ట్ లిస్టులో ఒకరిద్దరు టాప్ స్టార్స్ కూడా ఉన్నారు, వారితో కలిసి పనిచేయడానికి సుకుమార్ ఆసక్తి చూపుతున్నారు. అందుకే విజయ్ దేవరకొండకు ఈ ప్రాజెక్ట్ నో చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ కాంబోలో సినిమా రాబోతుందని సంతోష పడిన విజయ్ ఫ్యాన్స్ కి ఈ వార్తతో నిరాశే మిగలనుంది.

ఇవి కూడా చదవండి…

అయ్యో.. సూపర్ స్టార్ కి షోల్డర్ సమస్య

ప్రభాస్ డబుల్ రోల్ ?

వీరసింహారెడ్డి..మాబావ మనోభావాలు

- Advertisement -