ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే మొదటిసారి…

256
Jai Lava Kusa Satellite Rights Sold
- Advertisement -

ఎన్టీఆర్ కథానాయకుడిగా దర్శకుడు బాబీ ‘జై లవ కుశ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా రాశిఖన్నా .. నివేదా థామస్ .. నందితా రాజ్ నటిస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ .. రాశి ఖన్నా పెళ్లి జరిగే సన్నివేశాలు వున్నాయి. ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఆలయ నేపథ్యంలో వచ్చే ఈ సన్నివేశాలను నిన్న ‘చిలుకూరు బాలాజీ’ టెంపుల్ సమీపంలో చిత్రీకరించారు. ఈ సీన్ ఈ సినిమాకి కీలకమని .. హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

v

ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ చేసిన ‘నాన్నకు ప్రేమతో’ .. ‘జనతా గ్యారేజ్’ ఘన విజయాలను సాధించడం వలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి నెలకొంది.

దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి భారీ పోటీ ఏర్పడింది. చివరికి ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఇందుకోసం వాళ్లు 14 కోట్లను చెల్లించారనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. శాటిలైట్ హక్కులు ఈ స్థాయిలో పలకడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే మొదటిసారి అని అంటున్నారు. సెప్టెంబర్ 1న విడుదలైన ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాన్ని సాధించడం వలన, అదే రోజున ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఎన్టీఆర్ వున్నాడని చెబుతున్నారు..అయితే ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా కావడంతో అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -