జై లవకుశ….. రివ్యూ వచ్చేసింది!

605
Jai Lava Kusa review
- Advertisement -

‘జై లవకుశ’… ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్‌టాపిక్‌. ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.   ఈ సినిమా విదేశాల్లో కూడా విడుదల కానుండగా అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమేర్ సంధు.. ‘జై లవ కుశ’ రివ్యూ రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పసందైన విందని … డైరెక్టర్ కేఎస్ రవీంద్ర సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. స్టోరీ, స్క్రీన్ ప్లే చక్కగా ఉన్నాయని ఆయన చెప్పారు. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. స్టంట్స్ సూపర్ అని, క్లైమాక్స్ అదిరిపోయిందని ఆయన తెలిపారు.

ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, బ్లాక్ బస్టర్ హిట్ అని ఆయన తెలిపారు. ఈ సినిమాకు తాను 3.5 రేటింగ్ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.

టాలీవుడ్ సైతం జై లవకుశ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  ముఖ్యంగా ఇందులో ‘జై’పాత్ర సినిమా మొత్తానికి హైలైట్‌ అని చిత్ర వర్గాల సమాచారం. అందులో ఎన్టీఆర్‌ నటన, నత్తితో డైలాగ్‌లు పలికిన విధానం ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.  మరి ‘జై’ పాత్రలో ఎన్టీఆర్‌ వెండితెరపై నట విశ్వరూపం చూడాలంటే మనం మరో 24గంటలు ఆగాల్సిందే.

jai lava kusa

- Advertisement -