బాబా బయోపిక్‌లో బోల్డ్ బ్యూటీ..

200
- Advertisement -

ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం డేరా బాబా రామ్ రహీమ్ సింగ్ గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి తెలింసిందే. అయితే డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్, అతని దత్త పుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ జీవిత కథ ఆధారంగా సినిమా నిర్మించేందుకు బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ నడుం బిగించింది.

Rakesh Sawant Will Direct Ram Rahim Biopic

తన సోదరుడు రాకేష్ సావంత్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుర్మీత్ రాం రహీం సింగ్ పాత్రలో సంజయ్ గోరీ పోషిస్తుండగా, హనీ ప్రీత్ ఇన్సాన్ పాత్రను రాఖీ సావంత్ పోషిస్తోంది. ఈ సినిమాలో కేసు విచారణాధికారిగా తెలుగు సినిమాలతో పాటు, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా పేరు ‘సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా’ ను నిర్ణయించినట్టు తెలిపారు.

Rakesh Sawant Will Direct Ram Rahim Biopic

 

- Advertisement -